![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -416 లో.. ముకుంద ఇక ఇన్ని రోజులు ఎవరికి తెలియకుండా దాచిన నిజం బయటపెట్టి అందరిని షాక్ కి గురి చేసింది.నీకు సిగ్గు అనేదే లేదా నా భర్తపై ఆశపడుతున్నావంటు ముకుందని కృష్ణ తిడుతుంది. ముకుంద కోపంగా కృష్ణపై చెయ్యి ఎత్తుతుంది. పౌరుషం వచ్చిందా నీ బ్రతిక్కి అది కూడానా అని కృష్ణ అనగానే.. తప్పు చేస్తున్నావ్ కృష్ణ.. ముకుంద ని అలా అన్నానే అని బాధపడే రోజు వస్తుందని ముకుంద ఏడుస్తూ ఇంట్లో నుండి బయటకు వెళిపోతుంది. ఇప్పుడు మీరు హ్యాపీనా ఎందుకు నన్ను తీసుకోని వచ్చారు.. ఎందుకు ఇలా చేశారంటూ ఆదర్శ్ కోపంగా తన గదిలోకి వెళ్తాడు.
ఆ తర్వాత కృష్ణ, మురారి ఇలా జరిగిందేంటని బాధపడతారు. ముకుంద ఎలా మాట్లాడుతుందో చూసారా అని మురారితో కృష్ణ అంటుంది. ఇదంతా నేను ఎప్పుడో ఊహించానని మురారి అంటాడు. అపుడే మధు వచ్చి పెద్దమ్మ బాధపడుతుందంటూ వాళ్ళని తీసుకొని వెళ్తుంటాడు. అప్పుడే ఆదర్శ్ బ్యాగ్ తో బయటకు వెళ్తుంటే.. కృష్ణ, మురారి, మధు కలిసి ఆపుతారు. ముకుంద ఇంట్లో నుండి వెళ్ళడానికి నేను వెళ్ళడానికి దీని అంతటికి కారణం కృష్ణ... అని ఆదర్శ్ అంటు ఉంటే.. నా భార్య ఏం చేసిందంటు మురారి కోప్పడతాడు.. మిమ్మల్ని కలపాలని చూసింది.. అది తప్పా.. తప్పు ఏమైనా ఉందా అంటే అది నాది ఉంది. ముకుంద విషయం మీతో చెప్పి ఉంటే సిచువేషన్ ఇలా ఉండేది కాదు. నిజం చెప్పాలంటే తప్పు అంతా నీదే.. ఏదో ఫోన్ మాట్లాడటం విని చేతకాని వాడిలాగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళావంటూ ఆదర్శ్ పై మురారి కోప్పడతాడు.
ఆ తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడకి వెళ్ళకండి.. ముకుందని తీసుకొని వస్తాం. పెద్దత్తయ్య వచ్చేవరకు ఎవరు ఎక్కడికి వెళ్లొద్దని కృష్ణ, మురారి అంటారు. ఆ తర్వాత ఆదర్శ్ ని మధు బలవంతంగా లోపలికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ముకుంద ఎక్కడుందో ఉదయం వెతకాలంటూ కృష్ణ, మురారి అనుకుంటారు. ఉదయం లేవగానే ఆదర్శ్ డ్రింక్ చేస్తుంటే కృష్ణ, మురారి షాక్ అవుతారు. తరువాయి భాగంలో టీవీలో ఓ న్యూస్ చూస్తారు. గుర్తు తెలియని యువతి దుర్మరణం అంటూ వస్తుంది. అది చూసి ముకుందనే అంటు రేవతి ఏడుస్తుంది. తన చావుకి కారణం నువ్వే.. నా భార్య ప్రాణాలు తీసింది నువ్వే అని ఒప్పుకో కృష్ణ అని ఆదర్శ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |